ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్) పేరు మార్పుపై రచ్చ రచ్చ జరుగుతోంది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుని తొలగించి.. వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా పేరు పెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ భగ్గుమంది. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి.