పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రజెంటేషన్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు.
విజయవాడ సత్యనారాయణపురంలో బీజేపీ చేపట్టిన ప్రజా పోరు యత్ర సభను సోము వీర్రాజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనలపై విమర్శలు చేశారు. ‘‘పోలవరంపై అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారు. నిర్వాసితుల లెక్కలు ఇప్పటివరకు కేంద్రానికి ఇవ్వలేదు. తమ తప్పులు చెప్పకుండా కేంద్రంపై నిందలు వేస్తున్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే పోలవరంపై మాతో చర్చకు రావాలి. జగన్ సీఎం అయ్యాక ప్రజల్లోకి రావడమే మానేశారు. అప్పుడప్పుడు అసెంబ్లీలో మాత్రమే జగన్ కనిపిస్తారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి.