గౌహతి వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ లోకి అనుకోని అతిథి వచ్చింది. అంతే.. ఒక్కసారిగా అలజడి రేగింది. దాన్ని చూసి మైదానంలోని క్రికెటర్లు హడలిపోయారు. భయంతో వణికిపోయారు. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరో తెలుసా? పాము.. అవును.. క్రికెట్ గ్రౌండ్ లోకి పాము వచ్చింది.