భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మహిళల వన్డేల్లో 3,000 పరుగుల మైలురాయిని దాటింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళా క్రికెటర్లు ఉన్నారు. ఇంగ్లండ్ తో ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ తోనే స్మృతి మంధాన 3,000 పరుగులు చేసిన ఘనతను సాధించింది. మిథాలీ రాజ్ ఈ ఘనతను 88 వన్డే ఇన్నింగ్స్ లో సాధిస్తే, స్మృతి మంధాన 76 ఇన్నింగ్స్ లోనే సాధించింది. స్మృతి మంధాన యావరేజ్ 43+గా ఉంది. స్ట్రైక్ రేట్ 85. మహిళల వన్డేల్లో ఆమె భారత్ లో అత్యంత వేగంగా 3,000 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో తొలిస్థానంలో నిలిచింది.