సైబర్ నేరాల సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగదారులు సైబర్ నేరాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. సైబర్ నేరగాళ్లు రివార్డులు, నగదు బహుమతులు అంటూ ఆకర్షిస్తూ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు లింక్ లు పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేసిన వినియోగదారులు వారి అకౌంట్లలో సొమ్మును పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో ఆన్‌లైన్ లో సురక్షితంగా ఉండటానికి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భారత ప్రభుత్వం పలు సూచనలు జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో యాప్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు, ఆన్‌లైన్‌లో బ్రౌజ్ చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన, చేయకూడని పనుల జాబితాను విడుదల చేసింది.