ప్రస్తుత చలి వాతావరణం సైనసైటిస్‌కి అత్యంత అనుకూలించే సీజన్. అంతేకాదు అస్తవ్యస్త వాతావరణ పరిస్థితులు కూడా. ఎండగా ఉండాల్సిన రోజుల్లో వర్షం, వర్షాకాలంలో ఎండ.. మధ్యాహ్నం సమయంలో చల్లని గాలులు… ఇటీవల అన్నీ ఇలాంటి చిత్ర విచిత్ర వాతావరణ పరిస్థితులే చూస్తున్నాం. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అత్యధికులు ఎదుర్కొంటున్న సర్వ సాధారణ ఆరోగ్య సమస్య సైనసైటిస్. ఈ నేపధ్యంలో హైదరాబాద్, కొండాపూర్‌లో ఉన్న అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ఇఎన్‌టి డాక్టర్ మహమ్మద్ నజీరుద్దీన్ సైనసైటిస్‌కు లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నారిలా…