టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్, ఇండియన్ ఐడల్ 9 విజేత రేవంత్ ఓ ఇంటివాడయ్యాడు. గుంటూరుకు చెందిన అన్వితను పెళ్లాడాడు. ఆదివారం (ఫిబ్రవరి 6న) జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలు సహా, అత్యంత దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది.