సింగరేణి వచ్చే ఏడాది 177 జూనియర్ అసిస్టెంట్, 39 మైనింగ్ ఇంజనీర్, 10 ఇండస్ట్రియల్ ఇంజనీర్, 6 ఐటీ ఇంజనీర్‌తో పాటు ఇతర కేటగిరీల పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఏడేళ్ల కాలంలో 58 ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్ల ద్వారా 3,498, కారుణ్య వారసత్వ నియామకాల ద్వారా 12,553 కలిపి మొత్తం 16,040 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సింగరేణి సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.