ఎస్‌ఐ రాత పరీక్ష కుంభకోణంలో లొంగుబాట్లు పెరిగాయి. సోమవారం కలబురిగి జ్ఞానజ్యోతి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాశీనాథ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ పాఠశాల ముఖ్య నిందితురాలు దివ్య హగరగికి చెందినది. గత నెల 10 నుంచి పరారీలో ఉండగా, అరెస్టు తప్పదని తెలిసి కలబురిగిలో సీఐడీ ఆఫీసులో లొంగిపోయాడు. ఈ స్కాం సూత్రధారి రుద్రేగౌడపాటిల్, నీటిపారుదల శాఖ ఇంజనీర్ మంజునాథ మేళకుందతో కాశీనాథ్ కుమ్మక్కయినట్లు సమాచారం. ఆదివారం ఇంజనీర్ మంజునాథ లొంగిపోవడం తెలిసిందే.