సాధారణంగా షాపింగ్ మాల్స్‌లు కస్టమర్‌లను ఆకట్టుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తుంటాయి. కొన్ని చోట్ల డిస్కౌంట్ సేల్స్, గిప్ట్ కూపన్స్, వన్ ప్లస్ వన్ ఇలా అనేక మార్గాల్లో కస్టమర్‌లను తమ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తాయి. ఈ మధ్యకాలంలో మాల్స్‌ల మధ్య విపరీత పోటీ పెరిగింది. అయితే, కొత్త పద్ధతుల్లో కస్టమర్‌లను ఆకట్టుకోవడానికి మాల్స్ నిర్వాహకులు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. వీరి అంతిమ లక్ష్యం మాత్రం కస్టమర్‌లు తమ వైపునకు తిప్పుకోవడమే.