బిగ్‌బాస్ సీజన్-5 రేపిన చిచ్చు ఈ షో తర్వాత కూడా కొనసాగింది. అప్పటి వరకు ప్రేమికులుగా ఉన్న రెండు జంటల మధ్య బిగ్‌బాస్ అగాధం సృష్టించింది. అయితే దాన్నుంచి సిరి-శ్రీహాన్ బయటపడితే, దీప్తి సునయన- షణ్నూల మధ్య మాత్రం బ్రేకప్ వ్యవహారం కొనసాగింది. ఈ షో అయిన వెంటనే న్యూ ఇయర్‌కి ఒకరోజు ముందుగా షణ్నూతో దీప్తి తెగదెంపులు చేసుకుంది.