‘డాలర్ డ్రీమ్స్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శేఖర్ కమ్ముల 1972 ఫిబ్రవరి 4న జన్మించారు. తొలి సినిమాతోనే ఫస్ట్ సినిమాతోనే పలు అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు.అచ్చతెలుగు తియ్యదనం, విలువలకు ప్రాధాన్యత ఇస్తూ తెలుగు సినిమాకు వన్నెలద్దిన అతికొద్దిమందిలో శేఖర్ కమ్ముల ఒకరు. సిల్వర్ స్క్రీన్ పై తన దర్శక ప్రతిభతో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే ఐనా తనదైన స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో మంచి కాఫీ లాంటిమూవీల నుంచి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆనంద్, గోదావరి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా, లవ్‌స్టోరీ లాంటి సినిమాలను భారీ విజయాలను సాధించాయి. అటు మిడిల్ క్లాస్ వారైనా ఇటు యూత్ ప్రేక్షకులైనా ఫిదా అవ్వాల్సిందే. సకుటుంబ సపరివారం సమేతంగా థియేటర్ల ముందు జనం క్యూ కట్టాల్సిందే. తనకేసొంతమైన టేకింగ్‌తో ఏకంగా ఆరు నంది అవార్డులను సొంతం చేసుకున్నాడు. దటీజ్ దర్శక లీడర్ శేఖర్ కమ్ముల. అంతేకాదు ప్రముఖ దర్శకుడు బాపు, విశ్వనాథ్ తరువాత హీరోయిన్‌ను అందంగా, ఆత్మవిశ్వాసంగా ప్రొజెక్ట్ చేసిన ఘనత శేఖర్‌దే అని కచ్చితంగా చెప్పవచ్చు. అందంగా లేనా అంటూ తనదైన మేకింగ్ స్టైల్‌తో అదరగొట్టేస్తాడు.