తలకోన అడవుల్లో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న బడా ఎర్రచందనం స్మగ్లర్ చంద్రబాబును రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. దుంగలు నరికి తన సరంజామాతో నెరబైలు సమీపంలో పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. అతనితో పాటు ఎర్రావారిపాళెంకు చెందిన మరో ఇద్దరు, తిరుపతి కరకంబాడికి చెందిన ఇద్దరు, గంగవరం మండలానికి చెందిన ఇద్దరు స్మగ్లర్లు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కొంత మంది తప్పించుకు పారిపోగా గాలింపు కొనసాగుతున్నట్లు సమాచారం.