మేడారం సమ్మక్క–సారలమ్మల మహాజాతర పూజాకార్యక్రమాలు బుధవారం జరగనున్న గుడిమెలిగె పండుగతో ఆరంభం కానున్నాయి. ఈ పండుగ నిర్వహించేందుకు పూజారులు మంగళవారం సాయంత్రంనుంచి సిద్ధమయ్యారు. వచ్చే బుధవారం (9న) మండమెలిగె పండుగకు వారానికి ముందుగా గుడిమెలిగె పండుగ నిర్వహించడం ఆనవాయితీ. మేడారంలోని సమ్మక్క గుడి పూర్వకాలంలో గుడిసెతో ఉండేది.