నాగ చైతన్యతో విడాకుల తర్వాత కెరీర్ పరంగా జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తుంది సమంత. టాలీవుడ్, బాలీవుడ్,హాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలను ప్రకటిస్తూ.. బిజియెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది.
దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. అలాగే ఓ హాలీవుడ్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో ‘ఊ అంటావా’అనే స్పెషల్ సాంగ్ చేసి ఔరా అనిపించింది. ఈ పాట ఇప్పడు యూట్యూబ్‌లో టాప్ 100 మ్యూజిక్ వీడియోలలో మొదటి స్థానంలో ఉండడం విశేషం.