దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న రౌద్రం రణం రుధిరం ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. అయితే దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసుల నేపథ్యం, పలు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ, థియేటర్లు మూసివేయడం వంటి తదితర కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయితే తమ చిత్రాలకు నష్టం కలుగుతుందని భావించి వాయిదా వేసుకున్న నిర్మాతలు ఉన్నారు. అయితే ఆర్‌ఆర్ఆర్ సినిమా వాయిదా అనేక చిత్రాలకు కలసివచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అందుబాటులో ఉండేసరికి తమ సినిమాలకు మార్గం సుగమం అయినట్లు భావించి విడుదలకు సిద్ధమవుతున్నారు మేకర్స్.