బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బర్త్‌డే (డిసెంబరు 27, సోమవారం)సందర్భంగా హీరోయిన్ జెనీలియా డిసౌజా శుభాకాంక్షలు తెలిపారు. అయితే సల్మాన్ ఖాన్‌ను విష్ చేసేందుకు జెనీలియా సోమవారం సాయంత్రం పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. గతంలో జెనీలియా, సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేసిన ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.షేర్ చేసిన కొన్నిగంటల్లో, ఈ క్లిప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.