ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో నూతన శకానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కోటి రూపాయాలతో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ ఎగ్జామ్ సెంటర్, రూ.ఏడు కోట్లతో నిర్మించిన క్రీడా వసతి గృహం, అతిథి గృహాన్ని గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంస్కరణలు ప్రారంభించారని చెప్పారు.