తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ)కు సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) రిజిస్ట్రేషన్‌ను తక్షణమే పునరుద్ధరించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో బుధవారం ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. టీటీడీ చేపట్టే వివిధ సామాజిక, విద్య, ధార్మిక, సాంస్కృతిక కార్యకలాపాల నిర్వహణకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయవలసి వస్తుందని, శ్రీవారి ఆలయాన్ని సందర్శించే భక్తులతోపాటు విదేశాల్లోని భక్తులు ఇచ్చే విరాళాల సాయంతో టీటీడీ ఈ కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు.