ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టి దాదాపు 8 నెలలు అవుతోంది. అయినా యుక్రెయిన్ పోరాడుతునే ఉంది. రష్యా వెనక్కి తగ్గకపోయినా సైనికులను మాత్రం భారీగానే కోల్పోయింది. యుక్రెయిన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అయినా ఏమాత్రం తగ్గటంలేదు. ఐరోపా దేశాల మద్దతుతో ఉక్రెయిన్ సైతం దీటుగా బదులిస్తోంది. కానీ రష్యాకు సైనికుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా దొంగలను..హంతకులను సైన్యంలోకి తీసుకుంటోంది. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఇంటర్వ్యూలు చేసి ఆర్మీలో నియమించుకుంటోంది. ఈ విషయాన్ని ‘ది గార్డియన్’ కథనాన్ని వెలువరించింది.