రష్యా నుంచి ఇటీవల ఇండియా భారీ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే రష్యా నుంచి చమురు దిగుమతులు పెరిగాయి. అదీ తక్కువ ధరకే భారత్ చమురు కొనుగోలు చేస్తోంది.
దీనివల్ల ఇండియా రూ.35,000 కోట్లు లాభపడిందని అంచనా. గత ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు దిగింది. దీంతో అమెరికాతోపాటు యూరప్ దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి చమురు దిగుమతుల్ని నిషేధించాయి. దీంతో రష్యాలో భారీ స్థాయిలో చమురు నిల్వలు మిగిలిపోతున్నాయి. అందుకే భారత్‌కు తక్కువ ధరకే చమురు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకుంది. రష్యా పరిస్థితి ఆధారంగా భారీ డిస్కౌంటు ధరకే చమురును ఇండియా దిగుమతి చేసుకుంటోంది. గతంలోకంటే ఎక్కువ స్థాయిలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం రష్యాకు ఇండియా రెండో అతిపెద్ద చమురు దిగుమతి దారుగా ఉంది.