గత కొన్నిరోజులుగా ఇండియా వైడ్ ట్రెండ్ అయిన విషయం “ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్”. ప్రపంచవ్యాప్తంగా RRR చూసిన ఆడియన్స్ అండ్ సినీ సాంకేతిక నిపుణులు.. ఈ సినిమా ఆస్కార్ ను గెలుచుకునే ఛాన్సులు ఉన్నాయంటూ జ్యోష్యం చెప్పారు. కానీ భారత ప్రభుత్వం అందుకు ఆస్కారం లేకుండా ఇండియా తరుపు నుంచి ఆస్కార్ అవార్డ్స్ కు గుజరాతీ సినిమాని ఎంపిక చేసి ‘ఆర్ఆర్ఆర్’కు చెక్ పెట్టింది.