భారతదేశంలోనే మోస్ట్ అవేయిటెడ్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ స్టార్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న భారీ మల్టీస్టారర్‌పై అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగినట్లుగానే సినిమా ఉంటుందని ట్రైలర్, పాటలు, మేకింగ్ వీడియోస్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7, 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సినిమా దగ్గరపడటంతో మూవీ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది జక్కన్న టీం. ఇందులో భాగంగానే అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ‍్యూలు ఇస్తున్నారు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్.