రెండో టెస్ట్ సందర్భంగా న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్ బంగ్లాదేశ్ ఆటగాళ్ల నుంచి ‘గార్డ్ ఆఫ్ హానర్’ స్వీకరించాడు. గత నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టేలర్.. తన కేరిర్‌లో చివరి టెస్టు ఆడుతున్నాడు. 112 మ్యాచ్‌లు ఆడిన టేలర్ 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో 7600కి పైగా పరుగులు చేశాడు. రెండో రోజు టేలర్ బ్యాటింగ్ వచ్చిన సమయంలో బంగ్లా ఆటగాళ్లు వరుస క్రమంలో నిలబడి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. ఈ క్రమంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షుకలు కూడా ఒక్క సారిగా చప్పట్లు కొడుతూ అభినందించారు.