ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఓపెనర్‌గా బరిలోకిదిగి కేవలం 61 బంతుల్లో అజేయంగా 122 పరుగులతో రికార్డు సృష్టించిన విషయం విధితమే. అయితే గత మ్యాచ్‌లలో కేఏ రాహుల్, రోహిత్ శర్మలు ఓపెనర్లుగా బరిలోకి దిగుతూ వచ్చారు. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెన్లుగా బరిలోకి దిగుతారని చర్చ కొనసాగుతుంది. ఇదేవిషయాన్ని ఆదివారం విలేకరులు రోహిత్ శర్మను ప్రశ్నించారు. రోహిత్ మాత్రం.. టీ20 వరల్డ్‌కప్‌లో కేఎల్ రాహుల్ తనతో కలిసి ఓపెనింగ్ చేస్తాడని క్లారిటీ ఇచ్చాడు. ఈ నెల, వచ్చేనెల మొదటి వారంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో స్వదేశంలో భారత్ జట్టు టీ20 సిరీస్ లను ఆడనుంది. ఈ మ్యాచ్ లలోనూ ఓపెనర్ గా రాహుల్ బరిలోకి దిగుతాడని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.