వెస్టిండీస్‌తో నాలుగో టి20కి ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. మూడో టి20 సందర్బంగా వెన్నునొప్పితో ఇబ్బంది పడిన రోహిత్ శర్మ బ్యాటింగ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో మిగిలిన టి20లతో పాటు ఆసియాకప్‌కు దూరమవుతాడని వార్తలు వచ్చాయి. అయితే రోహిత్ వెన్నునొప్పి నుంచి కోలుకున్నట్లు సమాచారం. శనివారం ఫ్లోరిడా వేదికగా జరగనున్న నాలుగో టి20 మ్యాచ్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉంటాడని తెలిసింది. ఈ మేరకు రోహిత్ శర్మ ఫిట్‌నెస్ కూడా సాధించాడు.