మైసూరు జిల్లాలోని టి.నరిసిపుర పట్టణంలో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. కోట్లాది రూపాయల విలువైన బంగారు నగలు, నగదును దుండగులు లూటీ చేశారు. శ్రీనిధి డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో ఆహార, ఔషధ ఉత్పత్తుల వ్యాపారం చేసే ఓజీ శ్రీనివాస్ ఇంటిలో సోమవారం దొంగలు పడి సుమారు రూ. 30 లక్షల నగదు, రూ. 1.67 కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు.