తురితమ్ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. సండియార్ చిత్రం ఫేమ్ జగన్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఇది. మిస్ సౌత్ ఇండియా కిరీటధారిణి ఈడెన్ ఇందులో నాయకిగా నటిస్తున్నారు. ఈమె ఇంతకుముందు ఇరుక్కు ఆనా ఇల్‌లై, పణి విళుమ్ నిలవు చిత్రాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు హెచ్.వినోద్ శిష్యుడు శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.