‘ఇప్పుడే వస్తానమ్మా.. అంటూ బండి తీసుకుని బైటికిపోయినవ్. చూసిచూసి అర్ధరాత్రి ఐతంది బిడ్డా.. ఎక్కడికి పోయినవ్ రా.. అని ఫోన్ చేసిన. అన్నం తినకుండా పోయినవ్.. బుక్కెడంత తిందువురారా అని బ్రతిమిలాడిన. దగ్గరనే ఉన్నా అంటివి. గంటలో ఇంటికాడుంటా అంటివి. వచ్చి పడుకున్నావనుకున్నా కొడుకా.. ఇట్లా.. నీ బతుకు తెల్లారుతదనుకోలేదు బిడ్డా.. అంటూ ఆ కన్నతల్లి కడుపు వేదన కన్నీరు పెట్టించింది. బైక్ ప్రమాదంలో చనిపోయిన బక్కతట్ల ఉమామహేశ్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కాగా.. కొడుకు చదువుకుంటున్నాడని కూరగాయలు అమ్మిన పైసలతో బైక్ కొనిస్తే.. అదే అతడి ప్రాణాలు తీసిందని కన్నీరు మున్నీరయ్యారు.