దీనిని ‘బార్తోలిన్ అబ్సెస్’ అంటారు. చాలామందికి మీ ఏజ్ గ్రూప్‌లో వస్తుంది. ‘బార్తోలిన్ సిస్ట్స్’ అని వజైనా ఎంట్రన్స్‌లో రెండువైపులా ఉంటాయి. ఇవి కొంత డిశ్చార్జ్ చేసి, వజైనాని తేమగా ఉంచుతాయి. ఈ సిస్ట్స్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్‌తో బ్లాక్ అయితే, చీము పట్టి, వాపు వచ్చి, నొప్పిగా ఉంటాయి. మూత్రవిసర్జన కూడా కష్టంగా ఉంటుంది.
చాలామందికి ఏ కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చిందో చెప్పడం కూడా కష్టమే! బ్యాక్టీరియా, క్లామిడియా, గనేరియా వంటి ఇన్ఫెక్షన్లు వజైనాలో ఉంటే, ఈ సిస్ట్స్ బ్లాక్ అయి, గడ్డలు కడతాయి. వజైనల్ స్వాబ్ టెస్ట్ చేసి, ఏ బ్యాక్టీరియా ఉందో పరీక్షించాల్సి ఉంటుంది. ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్‌తో సిస్ట్స్ పగిలి, చీము బయటకు వచ్చి విపరీతమైన నొప్పి ఉంటుంది. మళ్లీ గడ్డ వచ్చే అవకాశం ఉంటుంది.
యాంటీబయోటిక్స్ ఇచ్చినా మళ్లీ గడ్డలు వస్తున్నాయంటే, సిస్ట్స్‌ని ఆపరేషన్ థియేటర్‌లో పూర్తిగా డ్రెయిన్ చేయాల్సి ఉంటుంది. అబ్జార్బబుల్ మత్తు ఇచ్చి, ఈ శస్త్రచికిత్స చేస్తారు. సిస్ట్స్ డ్రెయిన్ చేశాక, కుట్లు వేస్తారు. వారం రోజుల పాటు పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ డాక్టర్ సూచన మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. దీనికి డాక్టర్‌తో రెగ్యులర్ ఫాలోఅప్‌తో ఉండాలి.