►పిల్లల మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉండడం కూడా ఒక కారణం. ఈ సమస్య తో ఉన్న పిల్లలు ఎక్కువ సేపు మూత్రం నియంత్రించలేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది.
►పిల్లాడు ఆహారంలో అధికంగా కెఫిన్ లేదా డైయూరిటిక్స్ వంటివి ఎక్కువగా ఉన్నా కూడా మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది.
►మధుమేహం ఉన్నా కూడా పిల్లలకు మూత్ర నియంత్రణ ఉండదు.
►యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఒత్తిడి లేదా మానసిక సమస్యలున్నా కూడా మూత్ర నియంత్రణ ఉండదు.
►కాబట్టి పై కారణాల్లో ఏదో వైద్యుని సహాయంతో తెలుసుకుని తగిన చికిత్సను అందించాలి.