ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి తాజ్ మహల్. జీవితంలో ఒక్కసారైనా దానిని చూడాలని ప్రతీ ఒక్కరి కోరిక. తలపండిన దేశాధినేతలు సైతం దాని ముందు ఫోటో దిగాలని కలలు కంటారు. అలాంటి అద్భుత కట్టడం. అయితే ఇది ఒక వైపు మాత్రమే. తాజ్ మహల్ దగ్గర నుంచి ఎంతో అద్భుతంగా కనిపించినా .. దాని వద్దకు వెళ్లే మార్గం మాత్రం చాలా దుర్భరంగా ఉంటుంది. ఇరుకు సందులు, రోడ్డుపైకి చొచ్చుకు వచ్చిన షాపులు. తాజ్ మహల్ గురించి ఎంతో ఊహించుకుని వచ్చిన వారికి ఇక్కడ వేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి.