మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ధమాకా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాతో పాటు రవితేజ తన నెక్ట్స్ చిత్రాలుగా రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలను కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలోనే ఉండగా, రవితేజ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును ఓకే చేసే పనిలో ఉన్నాడు.