నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారింది. ఈ బ్యూటీ నటించిన పుష్ప చిత్రంలోని శ్రీవల్లి పాత్ర అమ్మడికి మంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ అవగా, శ్రీవల్లి పాత్రలో రష్మిక పర్ఫార్మెన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో ‘సామి.. సామి’ అంటూ రష్మిక వేసిన ఐకానిక్ స్టెప్స్‌కు ప్రత్యేక ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.