ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ దిగ్గజం రషీద్ ఖాన్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 క్రికెటర్ బిలాల్ సమీకి రషీద్ ఆర్థిక సహాయాన్ని అందించాడు. కాగా సమీ ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఆఫ్ఘాన్ జట్టులో భాగమై ఉన్నాడు. అండర్-19 ప్రపంచకప్ ముగిసిన తర్వాత సమీ తన బౌలింగ్ యాక్షన్‌పై ఇంగ్లండ్‌లో శిక్షణ పొందడానికి రషీద్ ఆర్థిక సహాయం చేశాడు.