ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప సినిమా ఫీవర్ నడుస్తోంది. కాగా ఈ సినిమాలో శ్రీవల్లి పాటకు బన్నీ వేసిన స్టెప్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పుష్ప ఫీవర్ క్రికెట్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన మేనరిజంలతో డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ ఎన్నో స్పూఫ్‌లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆటగాళ్లు వికెట్ పడగొట్టి శ్రీవల్లి పాటకు డ్యాన్స్ వేస్తూ సెలబ్రేషన్ జరుపుకున్న సంగతి తెలిసిందే.