మరికొన్ని గంటల్లో పెళ్లికూతురు మెడలో తాళి కట్టాల్సిన వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని క్రిష్టియన్‌పల్లిలో నివాసముండే చైతన్య అనే ఉపాద్యాయుడికి నేడు(గురువారం) 11 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. కాగా, తన పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన స్నేహితులను రిసీవ్ చేసుకునేందుకు జడ్చర్లకు స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు.