‘‘గుడ్ లక్ సఖి’ చిన్న సినిమా అని శ్రావ్య అనడం నాకు ఇబ్బందిగా అనిపించింది. మహానటి కీర్తీ సురేష్, నగేష్ సార్ వంటి జాతీయ అవార్డు గ్రహీతలు, దేవిశ్రీ ప్రసాద్‌గారు ఈ సినిమాకి పనిచేసినప్పుడు ఇది చిన్న సినిమా ఎలా అవుతుంది? చాలా పెద్ద సినిమా’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాత ‘దిల్’రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదలవుతోంది.