మెగా కోడలు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ భార్యగా, అపొలో అధినేత మనవరాలిగా కాకుండ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. ఫిట్ నెస్, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఇలా సోషల్ మీడియాను మంచి విషయాల కోసం వాడే ఉపాసన.. తాజాగా నెటిజన్ల ఆగ్రహానికి గురైయ్యారు. దానికి కారణం ఆమె షేర్ చేసిన ఒక ఫోటోనే.