జిల్లాల పునర్విభజనకు సంఘీభావంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా చల్లపల్లిలో గురువారం భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్కు సెంటర్ వద్ద నుంచి లక్ష్మీపురం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, ఏఎంసీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి, ఎస్సీ కాలనీ వద్ద వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు.