రాజమౌళి బాహుబలి సినిమాతోనే మన తెలుగు చిత్రపరిశ్రమ స్థాయిని పెంచాడు. ఇక RRR సినిమాతో హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లి ప్రపంచం నలుమూలలా మన తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటాడు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రేక్షకులు, టెక్నీషియన్లు, ప్రముఖులు.. చాలా మంది RRR సినిమాని అభినందించారు. ఇక హాలీవుడ్ లో అయితే రాజమౌళి మేకింగ్ కి చాలా మంది ఫిదా అయ్యారు. అక్కడి ఫిలిం ఫెస్టివల్స్ కి రాజమౌళిని పిలుస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన సినిమాలు షోలు వేస్తున్నారు.