పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజవబోతుందంటూ గత కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతుండగా అందులో నిజం లేదని కొట్టిపారేశారు మేకర్స్. దీంతో ఈ సినిమా థియేటర్లలోనే మొదట రిలీజవబోతుందని ఫుల్ హ్యాపీగా ఫీలైన ఫ్యాన్స్ ప్రభాస్‌ను ఎప్పుడెప్పుడు స్క్రీన్‌పై చూస్తామా? ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో రాధేశ్యామ్ మార్చి 11న విడుదల కానుందంటూ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. ‘లవ్, డెస్టినీకి మధ్య జరిగే యుద్ధాన్ని మార్చి 11న వీక్షించండి’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. కాగా పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్ ప్రకటించేయడంతో రాధేశ్యామ్ కూడా డేట్ అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇటలీ నేపథ్యంలో పీరియాడిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన రాధేశ్యామ్‌ను సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మించారు.