అందరూ ఊహించిందే జరిగింది. ‘రాధేశ్యామ్’ ప్రేక్షకులకు భారీ షాక్ ఇస్తూ దర్శకుడు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పరిస్థితులు బాగా లేవు అందరూ అప్రమత్తంగా ఉండండి, ఏది మన చేతిలో లేదంటూ దర్శకుడు రాధ కృష్ణ చేసిన అభిమానుల్లో గందగోళాన్ని సృష్టింస్తోంది. ఈ ట్వీట్ దేనికి సంకేతం, అందరూ ఊహించినట్టే రాధేశ్యామ్ కూడా వాయిదానా? అంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు దర్శకుడు. ఇక ఈ సారి సంక్రాంతి పండగ పెద్ద సినిమాలతో సందడి చేయబోతుందని ఆశించిన ప్రేక్షకులకు ఇప్పటికే నిరాశ ఎదురైంది.