క్యూలైన్‌లో గంటల తరబడి నిల్చోడమంటే ఎవరికైనా చిరాకే! కానీ ఓ వ్యక్తి క్యూలైన్‌లో నిలబడమే వృత్తిగా మార్చుకున్నాడు. సాధారణంగా ఒకరికోసం ఒకరు క్యూలైన్‌లో నిలబడటం మనం చూస్తుంటాం. అతను మాత్రం లైన్‌లో నిల్చోవడానికి డబ్బులు తీసుకుంటాడు.
కొంతమంది ధనవంతులకు సమయం లేక, క్యూలైన్‌లో నిల్చోవడం ఇష్టపడరు. అయితే అలాంటివారందరూ ఫ్రెడ్డీ బెకిట్ కస్టమర్లే. లండన్‌కు చెందిన ఫ్రెడ్డీ బెకిట్ ఈ మధ్య ఇలా ఎనిమిది గంటల పాటు లైన్‌లో నిల్చోని 160 పౌండ్లు(రూ.16,248) సంపాదించాడు. దీంతో ఈ ఘటన ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.