కరోనా వల్ల అన్ని వ్యాపారాలు దెబ్బతింటే ఓటీటీ మాత్రం పుంజుకుంది. ఎన్నడూ లేనంతగా రెట్టింపు ఆదాయంతో తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోయింది. అలా ఓటీటీల మధ్య కూడా పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ హవా ఉంటే భారత్‌లో మాత్రం అమెజాన్ ప్రైమ్ పైచేయి సాధించింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ‘మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు?’ అని ట్వీట్ చేసింది. దీనికి అమెజాన్ ప్రైమ్ వీడియో ‘అందరూ పుష్ప: ద రైజ్ చూస్తున్నారు’ అంటూ సమాధానమిచ్చింది.