ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప: ది రైజ్’. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం భారీ హిట్ కొట్టింది. కరోనా సమయంలోనూ అత్యధిక కలెక్షన్లతో దూసుకపోయింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 300 కోట్లు రాబట్టిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. 2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవడం మాత్రమే కాదు బన్ని కెరీర్ లో తొలిసారి రూ. 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది పుష్ప.