కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్రసీమకు తీరని లోటు. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, రామ్‌చరణ్.. ఇలా ఎంతోమంది తెలుగు సెలబ్రిటీలు బెంగళూరుకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
తాజాగా పునీత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు అల్లు అర్జున్ బెంగళూరు పయనమయ్యారు. గురువారం (ఫిబ్రవరి 3) ఉదయం 10 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలు దేరారు. బెంగళూరుకు చేరిన వెంటనే ముందుగా పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం పునీత్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించనున్నారు.