కట్టుకున్న భర్తను తన భార్య హతమార్చిన సంఘటన గిద్దలూరు పట్టణంలోని ఏడో వార్డులో గల శ్రీరాంనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. ఈ సంఘటనలో మేకల చిరంజీవి అలియాస్ అంజి(32) తన ఇంట్లోనే మృతి చెందాడు. అందిన సమాచారం ప్రకారం.. శ్రీరాంనగర్‌కు చెందిన అంజి పట్టణానికి చెందిన అంకాలమ్మను పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదట ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. గత కొన్ని రోజులుగా భర్త అంజి మద్యం సేవించి భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు.