నటుడు, మాజీ కేంద్రమంత్రి, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మరణం అయన కుటుంబానికి, టాలీవుడ్ కి తీరని లోటు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పించారు. ఇటీవలే హైదరాబాద్ లో కృష్ణంరాజు సంస్మరణ సభ నిర్వహించారు. త్వరలో కృష్ణంరాజు సొంతూరు అయిన మొగల్తూరులో స్మారక సభ నిర్వహించనున్నారు.