ఉజ్బెకిస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం సమర్‌ఖండ్ నగరంలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రష్యా తన తూర్పు ప్రాంతంలో ఉన్న యుక్రెయిన్ దేశంపై యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఈ యుద్ధం ప్రారంభం తర్వాత ఇరువురు నేతల మధ్య ఇది మొదటి సమావేశం. ద్వైపాక్షిక, ప్రాంతీయ, ఇతర ప్రపంచ సమస్యలతో పాటు యుక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధంపై ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం.